నాన్న కంటే నేనే ఎక్కువ

Lalu Prasad son Tej Pratap Yadav dons Krishna avatar for 2017

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఒక స్టైలిష్ పొలిటీషియన్. ఎప్పుడూ ఒరిజినల్ ఆమ్ ఆద్మీ గెటప్ లో కనిపిస్తూ.. వీలైనంతవరకు సామాన్య జన శైలికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. గేదెకు గడ్డి వేస్తారు.. పాలు పితుకుతారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూనే వుంటారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లాలూ కొడుకు, బీహార్ ఆరోగ్య శాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వేషాలెయ్యడంలో తానూ తక్కువ కాదంటున్నాడు. 2017 కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఆయన కృష్ణుడి వేషంలో కనిపించి అభిమానులను 'అలరించారు'. చేతిలో పిల్లనగ్రోవి పట్టుకుని కృష్ణ పరమాత్ముడి గెటప్ లో వున్న మంత్రిగారి ఫోటోలు ఇప్పుడు బీహార్ అంతటా హల్ చల్ చేస్తున్నాయి.


Teluguwow Tv

Related News