నోట్ల రద్దుతో వచ్చిన డబ్బును ప్రజలకు ఖర్చుపెట్టండి

Pawan Kalyan Meeting With Uddanam Kidney Chronic Victims

ఇచ్చాపురం కిడ్ని వ్యాధి బాధితులను జనసేన అధినేత పవన్ పరామర్శించారు. ప్రజల సమస్యలను తీర్చమంటే నిధుల్లేవ్.. నిధుల్లేవ్ అంటారు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీమానిటైజేషన్‌‌ అంటూ వారి దగ్గరున్న సొమ్మును మీ మీ బ్యాంకుల్లో వేశారు. సో బెలెడెంత డబ్బుంది మీ దగ్గర తక్షణమే ప్రజా సమస్యలను పట్టించుకోండి.. పరిష్కారం చూపాలంటూ కేంద్రానికి పవన్ సూచించారు. నోట్లరద్దును సమర్థించిన రాష్ట్రప్రభుత్వం దగ్గర కూడా పుష్కలంగా నిధులున్నాయి ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్టే దాదాపు 6వేల కోట్ల దాకా ఉంది కనీసం ఈ బాధితుల కోసం అందులో 30కోట్లు రూపాయిలు ఖర్చుపెట్టాలంటూ పవన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు.

అస్తమానూ ఆరోగ్య శాఖ మంత్రి డయాలసిస్ సెంటర్లు పెట్టించాం అంటూ చెప్పుకుంటున్నారు. కిడ్నీ బాధంటే ఏంటో నాకూ తెలుసు స్వయాన మా పిన్నిగారి భర్త కిడ్ని వ్యాధితో చనిపోయారు. డయాలసిస్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అంతే కానీ అదేదో చికిత్స అని బయటపడేలా తీసిపారేయకండి అంటూ పవన్ మంత్రి కామినేని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కటే చెబుతున్నా దయచేసి ప్రత్యేక కమిటీ వేయండి.. ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి అలాగే నిధులు వంద కోట్లు కేటాయించండి ప్రభుత్వాలకు పవన్ సూచించారు.


Teluguwow Tv

Related News