రజనీకాంత్‌కు 'గ్రీన్ సిగ్నల్'

Rajinikanth is on the way to politics

తమిళనాట రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు.. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుతూనే వున్నాయి. శశికళ టేకోవర్ తో కథ కంచికెళ్లినట్లేనని ఫిక్సయినప్పటికీ.. ఇంకా ఫుల్ స్టాప్ పడలేదన్న ఆనవాళ్లయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వమ్ కుర్చీ 'కదలిక' మీదే అందరి చూపూ ఆగిపోయింది. అటు.. సూపర్ స్టార్ రజనీకాంత్ వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ కోసం తమిళనాడు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.మొన్నీమధ్యే సీనియర్ కాంగ్రెస్ నేత పీ. చిదంబరం రజనీకాంత్ ని కలిసి మంతనాలు జరిపినట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఎటువంటి చప్పుడూ లేదు.

కట్ చేస్తే.. ఇప్పుడు కొత్తగా రజనీ ఫ్యాన్స్ వైపు నుంచి వత్తిడి మొదలైందన్నది తాజా వార్త. తిరుచ్చి రజని అభిమాన సంఘం పేరుతో వెలిసిన పోస్టర్లు తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత లేని లోటును పూడ్చడానికి, తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రజనీకాంత్ అరంగేట్రం చేయాలన్నది ఆ పోస్టర్ల సారాంశం. ఇటువంటి పోస్టర్లు సహజమే ఆయినా.. ఈసారి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఇవి హల్ చల్ సృష్టించడం విశేషం. రజనీ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.


Teluguwow Tv

Related News