సంక్రాంతికి కొత్త సీఎం?

Sasikala Natarajan all set to swear in as Tamil Nadu CM

జయలలిత మరణించిన నాటి నుంచే శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను శశికళకే కట్టబెట్టాలని పార్టీలోని అగ్రనాయకత్వం ఆశించింది. ఈ దశలో పేరుకు సీఎం పన్నీర్‌సెల్వంమైనా ప్రతిదీ శశికళ కనుసన్నల్లోనే సాగుతోంది. పన్నీర్‌సెల్వం సైతం దాదాపుగా ప్రతిరోజూ శశికళ వద్ద çహాజరీవేయించుకుంటున్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక సీఎం సీటే తరువాయిగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మరీ ఎక్కువగా కాలికి బలపం కట్టుకుని ఊరువాడా తిరుగుతున్నారు.

ఇతనికి మంత్రులు ఆర్‌పీ ఉదయకుమార్, కడంబూరు రాజా, సేవూరు రామచంద్రన్ తదితరులు తోౖడయ్యారు. కొత్త ఏడాదిరోజున అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించిన మంత్రులు శశికళను కలుసుకుని సీఎం బాధ్యతలు స్వీకరించాలని కోరారు. మంత్రులు ఓఎస్‌ మణియన్, తంగమణి వీరికి వంత పాడారు. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా సోమవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్ లో శశికళతో సమావేశమై మరోసారి ఒత్తిడి తెచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల ఈనెల ఈ ఉత్సవాల నాటికి శశికళను సీఎం చేసి ఆమె నేతృత్వంలో శతజయంతి ఉత్సవాలు సాగాలని ఆశిస్తూ నుంచి∙ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి శశికళనే సీఎం అనే తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించి చిన్నమ్మ శశికళను సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయనున్నారు.


Teluguwow Tv

Related News