తింటే తినండి.. లేకపోతే పొండి..!

Service charge by hotels and restaurants not mandatory

హోటళ్ళలో సర్వీసు నచ్చితేనే సర్వీస్ చార్జి చెల్లించండి లేకపోతే పొండి అంటోంది అఖిల భారత రెస్టారెంట్ల సంఘం. ఈ చార్జీలు చెల్లించడానికి ఇష్టపడని కస్టమర్లు ఆ చార్జి విధించే హోటళ్ళు లేదా రెస్టారెంట్లకు వెళ్ళడం మానుకోవచ్చునని పేర్కొంది. సర్వీసు చార్జి విధింపు అన్నది సాధారణమేనని, అందరూ ఆమోదించేనని ఈ సంఘం అధ్యక్షుడు రియాజ్ అమ్లానీ అంటున్నారు. ఇలా సర్వీసు చార్జిగా వచ్చిన సొమ్మును సిబ్బంది అందరికీ సమానంగా పంచుతామని ఆయన తెలిపారు. హోటళ్ళు, రెస్టారెంట్లు ఈ చార్జిని పూర్తిగా తొలగించే బదులు, తమ వద్దకు వచ్చే వినియోగదారులను ఈ చార్జి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతాయట. ఇష్టపడకపోతే మరో హోటల్ కు వెళ్లాల్సిందిగా సూచిస్తాయట.


Teluguwow Tv

Related News