సెలబ్రిటీలకు కేటీఆర్ ఛాలెంజ్

KTR Handloom Challenge To Tollywood Celebs

కొన్ని నెలల క్రితం ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ ఇంటర్నేషనల్ గానూ.. రైస్ బకెట్ ఛాలెంజ్ అంటూ దేశంలోనూ ఓ సవాల్ తో కూడిన ఛారిటీ కేంపెయిన్స్ నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఓ ఛాలెంజింగ్ కార్యక్రమాన్నే ప్రారంభించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఆయన చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు సవాల్ లో భాగంగా.. ఆయన అడిగిన ప్రశ్న సున్నితంగానే ఉన్నా.. గట్టిగానే చురక అంటించేదిగా ఉండడం విశేషం. ఈ ఛాలెంజ్ ప్రకారం హ్యాండ్ లూమ్స్ ధరించి ఫోటో దిగి పోజ్ ఇవ్వాల్సి ఉంటుంది.

'చేనేత పనివారిని ఆదుకోవడానికి నేను హ్యాండ్ లూమ్స్ ధరిస్తున్నా.. మీ సంగతేంటి?' అంటూ నిలదీసిన ఆయన.. కొంతమందిని ఇందుకోసం నామినేట్ చేశారు. మహేష్ బాబు.. వివేక్ ఒబెరాయ్.. మంచు లక్ష్మి.. నాగార్జున.. సమంత.. సానియా మీర్జాలను ఆయన హ్యాండ్ లూమ్స్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను వెంటనే స్వీకరించిన సానియా మీర్జా.. 'ఆస్ట్రేలియన్ ఓపెన్ పూర్తయి హైద్రాబాద్ రాగానే ధరిస్తాను' అంటూ ఆన్సర్ ఇచ్చిన సానియా.. తన తోటి ప్లేయర్లయిన మహేష్ భూపతి.. రోహన్ బోపన్నలతో పాటు షట్లర్ పీవీ సింధు.. టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటిలకు సవాల్ విసిరింది.

అయితే కేటీఆర్ సవాల్ కు కమల్ హాసన్ నుంచి తక్షణమే స్పందన రావడం విశేషం. 'నేను కూడా చేనేత వస్త్రాలను ధరిస్తాను. మా నాన్నను ఆయన జీవితం మొత్తం మీద హ్యాండ్ లూమ్స్ లో తప్ప వేరే దుస్తుల్లో నేను చూడలేదు' అని చెప్పారు కమల్ హాసన్.


Teluguwow Tv

Related News