వత్తిడి స్టూడెంట్స్ కా... టీచర్లకా...

School tells pupils to wear newspapers in exams to stop them cheating

పిచ్చి కుదిరింది.. రోకలి తలకు చుట్టండి అన్నట్టుంది చైనాలోని చుజుహౌ ఎక్స్పెరిమెంటల్ స్కూల్ టీచర్ల పరిస్థితి. ఈ స్కూల్ పిల్లలు పరీక్షలు రాసేసమయంలో తలపై న్యూస్ పేపర్లు ధరించాలంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇలా తల మీదుగా న్యూస్ పేపర్ ధరిస్తే స్టూడెంట్స్ వత్తిడికి గురవ్వరనీ, ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే ఛాన్స్ కూడా ఉండదని వాదిస్తున్నారు టీచర్లు... అయితే ఈ న్యూస్ పేపర్ కాస్ట్యూమ్.. మాస్ కాపీయింగ్‌ను ఏ మేరకు అరికడుతుందో కానీ, దీనివల్ల స్టూడెంట్స్ గౌరవానికి భంగం వాటిల్లుతుందని కొంత మంది వాదిస్తున్నారు.

ఈ లోగా గుర్తుతెలియని కొంతమంది విద్యార్దుల తలలపై న్యూస్ పేపర్లు వుంచి పరీక్షలు రాయిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతోఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొంతమంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు. ఎంత రచ్చ చేసినా ఈ పధ్దతిని విడిచిపెట్టేది లేదనీ,పైగా ఇలా న్యూస్ పేపర్ ధరించడం వల్ల పరీక్షల్లో కాపీయింగ్, మానసిక వత్తిడి కూడా అరికట్టొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా పరీక్షలప్పుడు మార్కులెక్కువ రావాలనే వత్తిడి వాళ్లపై ఎక్కువగా ఉంటుందనీ, ఇలా న్యూస్ పేపర్ల 'కాస్ట్యూమ్స్'తో ఎగ్జామ్స్ రాస్తే అదంతా దూరం అవుతుందని వాదిస్తున్నారు.


Teluguwow Tv

Related News