కూల్ గా ఇక సెలవన్నాడు..!

Dhoni goodbye to captancy

మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. టీమిండియాను దాదాపు పదేళ్ళ పాటు విజయ పథంలో నడిపిన ధోని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్ తో జరగబోయే వన్డే, టీ-20 సిరీస్ జట్టు ఎంపికకు రెండు రోజులముందే కెప్టెన్సీ బాధ్యతలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే ప్లేయర్ గా కొనసాగుతాడని బీసీసీఐ తెలిపింది. ఇంగ్లండ్ తో జరగబోయే సిరీస్ కోసం శుక్రవారం సెలెక్షన్ జరగనుంది. ఆ సెలెక్షన్ లో ధోని వికెట్ కీపర్-బ్యాట్స్ మన్ గా అందుబాటులో ఉంటాడని తెలిసింది. ధోని వైదొలగడంతో ఇక విరాట్ కోహ్లీయే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ కానున్నాడు. 35 ఏళ్ళ ధోని 2014 లో ఆస్ట్రేలియా టూర్ లో టెస్టు లకు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం ఆడుతున్నాడు. బహుశా బీసీసీఐ లో ఇటీవల తలెత్తిన పరిణామాలకు మనస్తాపం చెందే మిస్టర్ కూల్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు.


Teluguwow Tv

Related News