నోటులో గాంధీ బొమ్మ లేదు

Gandhi missing from rs 2 thousand notes

నోట్ల రద్దుతో అసలే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులకు మరో షాక్.. కొత్త 2 వేల నోట్లలో గాంధీ బొమ్మ కనబడకుండా పోయింది. మధ్యప్రదేశ్ శివ పూర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో రైతులు ఇలాంటి నోట్లు చూసి నిర్ఘాంతపోయారు. అది బిచ్చు గౌడీ అనే గ్రామం. ఆ గ్రామంలో ఎస్ బీ ఐ ఏ టీ ఏం నుంచి తాము విత్ డ్రా చేసుకున్న రెండు 2 వేల నోట్లలో గాంధీ బొమ్మ కనబడలేదు వీరికి. ఈ విషయాన్ని వాళ్ళు బ్యాంకు అధికారుల దృష్టికి తేగా..ఇవి అసలైన నోట్లేనని, నకిలీవి కావని అంటూ వాటిని వెనక్కి తీసుకున్నారు. బహుశా ప్రింటింగ్ లోపమై ఉంటుందని అన్నారు. ఆ మధ్య హోషంగాబాద్ లోని ప్రింటింగ్ అయిన 80 వేల 500 నోట్లలో కూడా ఎన్నో పొరబాట్లు దొర్లాయి.వాటిని సరిదిద్ది తిరిగి సరికొత్త నోట్లు ప్రింట్ చేసేసరికి సిబ్బందికి తల ప్రాణం తోక కొచ్చినంత పనయింది.


Teluguwow Tv

Related News