నోబెల్ తెస్తే 100 కోట్లు ఇస్తా..!

Chandrababu announces Rs 10 crore prize for anyone who wins Nobel from ap

తమ రాష్ట్రానికి చెందిన ఏ సైంటిస్టు అయినా నోబెల్ ప్రైజు సాధిస్తే అతనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల రివార్డు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు.నోబెల్ ప్రైజ్ మనీ 5.96 కోట్లే. కానీ దీనికి సుమారు 17 రెట్లు ఎక్కువగా ఇస్తామని అంటున్నారు బాబు. ఈ దేశంలో బహుశా మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత రివార్డు ప్రకటించిన దాఖలాల్లేవు. తిరుపతిలో బుధవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104 వ సెషన్ సందర్భంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన బాబు.. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ టకాకీ కజితా (జపాన్ ) ను ప్రశంసించారు. ఈ బహుమతి ఎలా పొందారో చిట్కా చెప్పాలని ఆయనను కోరారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభ చూపడానికి ప్రతి విద్యార్థీ కృషి చేయాలని, నోబెల్ బహుమతి పొందేంతగా శ్రమించాలని అయన పిలుపునిచ్చారు. ఏపీలో కొందరు టాప్ సైంటిస్టులు, టెక్నాలజిస్టులు ఉన్నా వారిలో ఎవరూ ఇప్పటివరకు నోబెల్ ప్రైజ్ పొందలేదని చంద్రబాబు పేర్కొన్నారు.


Teluguwow Tv

Related News