ప్రభుత్వానికి హార్ధిక్‌ వార్నింగ్

Hardik patel challenge to gujarat govt

తమ ఆందోళనను అడ్డుకోడానికి ప్రయత్నిస్తే సంక్షోభం సృష్టిస్తామ‌ని పరోక్షంగా గుజరాత్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్ధిక్‌ పటేల్. బుధవారం ఉదయ్‌పూర్‌లోని సమితి నేతలతో ఆయన సమావేశమయ్యాడు. న్యాయస్థానం ఆదేశాలతో ఆరునెలలు రాజస్థాన్‌లోవున్న హార్థిక్‌పటేల్‌ ఈనెల 17న గుజరాత్‌లో అడుగు పెట్టబోతున్నాడు. తమ నేతకు స్వాగతం పలకేందుకు పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా చేపట్టనున్న ర్యాలీకి రెండు లక్షలమంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తోంది సమితి.

ర్యాలీని విజయవంతం చేసేందుకు సమితి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్‌ ద్రోహి ఈజ్ బ్యాక్ క్యాప్షన్‌తో కూడిన హార్థిక్‌పటేల్ ఫోటోను ఆన్‌లైన్‌లో ప్రచారం మొదలుపెట్టేసింది. గుజరాత్ జనాభాలో 18 శాతమున్న పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలన్నది హార్దిక్ ప్రధాన డిమాండ్. కొద్దిరోజుల కిందట ఆ రాష్ర్టవ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళనలు చెలరేగాయి. ఇందులోభాగంగా హార్దిక్ వ్యాఖ్యలపై న్యాయస్థానం.. ఆరునెలలపాటు గుజరాత్‌లో ఉండకూడదన్న షరతుతో అతడికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే!


Teluguwow Tv

Related News