ఆర్బీఐ గేటు వద్ద టాప్‌లెస్‌గా..!

Woman goes topless at RBI gate Delhi

నోట్ల రద్దు కష్టాలకు అద్దం పట్టే దృశ్యమిది. రద్దయిన పాత నోట్లను మార్చుకోవడానికి తన చిన్నారితో సహా బుధవారం ఢిల్లీలోని ఆర్బీఐ కేంద్రానికి వచ్చిందీ మహిళ. కానీ అక్కడున్న గార్డులు కుదరదు పొమ్మన్నారు. అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించిన ఆమెను పోలీసులు జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లబోతే.. వారి నుంచి తప్పించుకుని ఆగ్రహంతో ఊగిపోయింది. పెద్దగా రోదిస్తూ తాను ధరించిన స్వెటర్‌, కమీజును విప్పేసి పైభాగంలో నగ్నంగా తయారై నిరసన తెలిపింది. తల్లి రోదిస్తుండడంతో ఆ చిన్నారి కూడా హృదయవిదారకంగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పార్లమెంట్‌ సెంట్రల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె తనవద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపట్లేదని.. మార్చుకోవడానికి తెచ్చిన సొమ్ము ఎంతన్నదీ చెప్పట్లేదని పోలీసులు తెలిపారు.


Teluguwow Tv

Related News