ఏ అమ్మాయినీ వదల్లేదు..!

Woman molested on Bangalore Street in December 31st Night

బెంగళూరులో డిసెంబరు 31 అర్ధరాత్రి వేళ జరిగిన దారుణాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రధాన కూడళ్లపైన జరిగిన అకృత్యాల దృశ్యాలే బయటకు రాగా.. తాజాగా ఓ నివాస ప్రాంతంలో నిర్మానుష్య కాలనీలో అమ్మాయిపై వేధింపుల సీసీ టీవీ ఫుటేజీ కూడా బయటపడింది. శనివారం అర్ధరాత్రి దాటాక.. కమ్మనహళ్లి ప్రాంతంలోని 5వ మెయిన్‌ రోడ్‌లో తెల్లవారుజామున 2.40 సమయంలో ఒక యువతి ఆటో దిగింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాక కొన్ని సెకన్ల తర్వాత మరో యువతి ఆటోలోంచి దిగింది. నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తున్న ఆ యువతి వెనుకగా ఇద్దరు కుర్రాళ్లు బండిపై వచ్చారు. ఆమెను చూడగానే.. యూటర్న్‌ కొట్టి బండిని ఒక పక్కగా ఆపారు. ఆ దుర్మార్గుల ఉద్దేశాన్ని గమనించిన ఆమె అక్కణ్నుంచీ పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిలో ఒక వ్యక్తి బండి దిగి, ఆమె వద్దకు దూసుకెళ్లి గట్టిగా పట్టుకుని స్కూటర్‌ దాకా గుంజుకెళ్లాడు. ఆమెను తాకరాని చోట్ల తాకాడు. రెండో వ్యక్తి కూడా అతడితో జతకలిశాడు. ఆమె దుస్తులు చించివేయడానికి ఇద్దరూ ప్రయత్నించారు.

కానీ ఆమె కూర్చుండిపోయి తీవ్రంగా ప్రతిఘటించడంతో వారివల్ల కాలేదు. కాసేపు పెనుగులాట జరిగిన తర్వాత ఆమెను రోడ్డు మీదకు తోసేసి ఇద్దరూ పరారయ్యారు.ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. అక్కడ సీసీ కెమెరా ఉండటం గమనించిన ఆమె మర్నాడు ఉదయం ఆ ఇంటికి వెళ్లి.. రాత్రి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పి, వారు తన పర్సు కూడా కొట్టేశారని చెప్పగా ఇంటి యజమాని ఆ ఫుటేజీని చూశారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం తనకు ఇష్టం లేదని.. ‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’ అంటూ ప్రభుత్వమే అంటున్నప్పుడు పోలీసు కేసులంటూ తమను తాము బద్నాం చేసుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదని బాధితురాలు పేర్కొనడం గమనార్హం. ఈ దారుణాలపై మీడియాలో, సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి జడిసి హడావుడిగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. కమ్మనహళ్లి ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Teluguwow Tv

Related News