మనోళ్ళకు షాకిచ్చారు..!

Us cancels accreditation panel indian students hit

లక్షలాది భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. వీరి అక్రిడిటేషన్ సౌకర్యాన్ని రద్దు చేసింది.అమెరికాలోని ఇండిపెండేంట్ కాలేజీలు, స్కూళ్ళకు సంబంధించిన అక్రిడిటింగ్ కౌన్సిల్ గుర్తింపును యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేసింది. అక్కడి స్టూడెంట్ అండ్ ఎక్స్ చేంజ్ విజిటింగ్ ప్రోగ్రాం కు సంబంధించిన సర్టిఫైడ్ కాలీజీలు, స్కూళ్ళు సుమారు 250 వరకు ఉన్నాయి. వీటికి అక్రిడిటేషన్ గుర్తింపును ఈ కౌన్సిల్ ఇస్తూ వచ్చింది. అయితే దీన్ని రద్దు చేయడంతో ఈ సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.

వీరికి డిసెంబరు 12 నుంచి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపును నిరాకరిస్తున్నారు. తమ సంస్థలు అక్రి డిటేషన్ సౌకర్యాన్ని కోల్పోవడంతో ఇక ఈ స్టూడెంట్స్ ఇతర కాలేజీలకు షిఫ్ట్ కావలసిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపు సౌకర్యానికి వీరు నోచుకోబోరు. ఈ ఫెసిలిటీ కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా ముప్పు కలుగుతోంది. ఎఫ్-1 వీసా హోల్డర్ల పొడిగింపు దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు అప్పుడే తిరస్కరించడం ప్రారంభించారు.


Teluguwow Tv

Related News