తండ్రీ కొడుకుల కథ

Naa Koduku Pelli Jaragali Malli Malli Movie Launch

సింహ ఫిలిమ్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ’. శంకర్‌, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గంటా రామకృష్ణ నాయుడు దర్శకుడు. అనిల్‌కుమార్‌.జి. నిర్మాత. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం గురువారం ఉదయం మొదలైంది. శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటిదాకా ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను. ఇటీవల చేసిన ‘రాజుగారి గది’లోలాగా ఇందులోనూ ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో చేస్తున్నాను. నా తండ్రిగా పోసానిగారు చేస్తున్నారు. ఈ చిత్రానికి నిజమైన హీరో ఆయనే’’ అని అన్నారు. పోసాని మాట్లాడుతూ ‘‘తండ్రిగా చాలా చిత్రాల్లో చేశాను. కానీ ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌. మా ఇద్దరి కాంబినేషన ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. నిర్మాతగా నాకు ఇది తొలి చిత్రం’’ అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: కల్పన, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్‌, కెమెరా: ఎస్‌.రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.రవీంద్రారెడ్డి.


Teluguwow Tv

Related News