పేదలు కష్టపడకుండా జాగ్రత్త తీసుకోవాలి

Pranab Mukherjee says demonetisation drive may temporarily slow down economy

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక మందగమనం కారణంగా పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సూచించారు. నల్లధనాన్ని నియంత్రించే, అవినీతిపై పోరాడే క్రమంలో పెద్దనోట్ల రద్దు తాత్కాలికంగా ఆర్థిక మందగమనానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘‘దీర్ఘకాలంలో పురోగతికి పేదలకు కష్టాలు ఎదురుకావడం తప్పకపోవచ్చు. ఈ కష్టాలను తగ్గించడానికి మనమందరం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.’’ అని రాష్ట్రపతి అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను సమీకరించడంలో, వారిని ఆకర్షించడంలో పెరిగిపోతున్న పోటీ, ఎన్నికల ప్రసంగాలు, ఓటు బ్యాంకు రాజకీయాల గురించి రాష్ట్రపతి హెచ్చరిస్తూ ఇటువంటి ధోరణితో సమాజంలో చీలికలు పెరగవచ్చన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు వారి వారి రాష్ట్రాల ప్రజల గౌరవం పొందాలని, సమాజంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి వారు ముఖ్య పాత్ర పోషించవచ్చని సూచించారు.


Teluguwow Tv

Related News