ఫిబ్రవరిలో లారెన్స్ శివలింగా

Lawrence Shiva Linga Set For February Release

కొరియెగ్రాఫ్గా మంచి ఫాంలో ఉండగానే దర్శకుడిగా మారి తరువాత హీరోగానూ వరుస సక్సెస్లు సాధిస్తున్న నటుడు లారెన్స్. ముని సీరీస్తో సూపర్ హిట్ లు సాధించిన లారెన్స్ మరో హర్రర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గత చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డాన్సింగ్ స్టార్ కొత్త సినిమాను ఓ సినీయర్ దర్శకుడితో చేస్తున్నాడు.

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన శివలింగా సినిమాను అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న లారెన్స్. ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ను డైరెక్ట్ చేసిన పి.వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Teluguwow Tv

Related News