ప్రభాస్ను ఇంటికి పంపేసిన రాజమౌళి

Prabhas Wraps Up His Shoot Finally

దాదాపు నాలుగేళ్లుగా బాహుబలి సినిమాకే పరిమితమైన హీరో ప్రభాస్ ఫ్రీ అయ్యాడు. బాహుబలి రెండో భాగంలో ప్రభాస్ కనిపించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తవ్వటంతో ప్రభాస్ను విడుదల చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బాహుబలి సినిమా అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులందరూ బాహుబలితో పాటు వేరే సినిమాల్లో కూడా నటించారు. కానీ ప్రభాస్ మాత్రం మరో సినిమా అంగకీరించకుండా బాహుబలికే పరిమితమయ్యాడు.

సినిమాలో కీలక పాత్ర కావటంతో పాటు బాహుబలి కనిపించటం కోసం భారీ కండలు, పొడవాటి జుట్టుతో మహారాజులా మారిపోయాడు ప్రభాస్. ఆ లుక్తో ఇతర సినిమాలు చేయటం కుదరకపోవటం. బాహుబలి కోసమే శారీరకంగా, మానసికంగా విపరీతమైన శ్రమ పడటంతో గ్యాప్ వచ్చిన సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఆసక్తికనబరచలేదు. ఇప్పుడు బాహుబలి రెండో భాగం కూడా పూర్తవ్వటంతో ప్రభాస్ ఇక నార్మల్ లుక్లో కనిపించనున్నాడు. త్వరలోనే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించేందుకు అంగీకరించాడు.

 

Thank you Prabhas, our one & only "Baahubali" for your love and trust in us! Your commitment to good film making is an inspiration to all!

— Baahubali (@BaahubaliMovie) January 6, 2017

 

And finally the day has come when we have to say good bye to Prabhas! It's a wrap for him on our sets !#Baahubali #Baahubali2 #WKKB

— Baahubali (@BaahubaliMovie) January 6, 2017

 


Teluguwow Tv

Related News