ఖైదీ ఫంక్షన్‌కి పవన్ పక్కా

Khaidi No 150 pre release event at Haailand

చిరంజీవి 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈనెల 7న గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించే ఈవెంట్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానుంది. మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌, వరుణ్ తేజ్ హాజరుకానున్నారు. ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. పవన్ రావడంలేదని వార్తలు హంగామా చేస్తున్నా, అలాంటిదేమీ లేదంటోంది మెగా క్యాంప్. అన్నయ్య ల్యాండ్‌మార్క్ మూవీ ఫంక్షన్‌కి తమ్ముడు రాకుండా ఎలా వుంటాడని, అందులోనూ దీనికి చీఫ్‌గెస్ట్‌గా దాసరి నారాయణరావుని ఆహ్వానించడం వెనుక తమ్ముడు పవన్ వున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ రాకని సర్‌ప్రైజ్‌గా వుంచాలని మెగా టీం ప్లాన్ చేసిందని, అందుకే కన్ఫర్మ్ చేయలేదని అంటున్నారు. ఏదేమైనా పవన్ వస్తాడా లేదా అనేది మరి కొద్దిగంటల్లో తేలనుంది.


Teluguwow Tv

Related News