సోనారిక మళ్లీ బికినీ రచ్చ స్టార్ట్

Sonarika Bhadoria ups the temperature this winter with her hot bikini pic

సోనారికా భడోరియా చేసిన సినిమాలు తక్కువే అయినా.. క్రేజ్ మాత్రం ఎక్కువే. అటు బుల్లితెరపై కూడా నటించి మెప్పించేస్తున్న ఈ బ్యూటీకి సోయగాలు కూడా ఎక్కువే. వాటిని ఎక్స్ పోజ్ చేయడంలో అమ్మడికి అభ్యంతరాలు ఉండవు కానీ.. అప్పుడప్పుడూ తను చేసిన కేరక్టర్ల కారణంగా వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ పాత్రలకు.. ఈమె రియల్ లైఫ్ లో చూపించే అందాలకు మ్యాచ్ కాకపోవడమే ఇందుకు కారణం.

ఆ మధ్య ఓసారి సోనారికా బికినీలో ఫోటోలు దిగి నెట్ లో పోస్ట్ చేస్తే రచ్చ రచ్చ అయింది. టీవీ సీరియల్ లో పార్వతీ దేవిగా నటిస్తూ.. ఈ హంగామా ఏంటని తిట్టిపోశారు. ద్రౌపది కేరక్టర్ చేస్తే.. ఐదుగురిని చేసుకోవాలా అని నిలదీసి వాళ్ల నోళ్లు మూయించిన సోనారిక.. కొన్నాళ్లు సైలెంట్ అయినా.. మళ్లీ ఇప్పుడు తన రూట్ లోకి వచ్చేసింది. ఎంచక్కా బికినీ వేసి.. సముద్రంలో జలకాలాడుతూ ఫోటో దిగి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి కానీ.. బికినీలో అమ్మడి సౌందర్యం మాత్రం ఫ్యాన్స్ ని కేకలు పెట్టించేస్తోంది.


Teluguwow Tv

Related News