కిలో మిర్చి రూ 2,900

The eye watering story of why Bhutan lost its appetite after a ban on Indian chillies

కొత్త సంవత్సరానికి గుర్తుగా భూటాన్‌ ప్రజలు ఏటా జరుపుకునే 'లోంబా' పండుగ ఈసారి చిన్నబోయింది. ఈ పండుగ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట విందు భోజనం చేస్తారు. వారి విందులోకి వారికి పసందైన కూర ‘హోయెంటే’ ఈసారి మెజారిటీ ప్రజలకు దొరక్కుండా పోయింది. వారి సంప్రదాయక వంటైన ఈ కూరలో నింపుడు పచ్చి మిరపకాయల్లో పెరుగు కలిపి వండుతారు. భారత్‌ నుంచి దిగుమతయ్యే హైబ్రీడ్, టెరాన్సాని, ఆకాశి రకాల మిరపకాయలను భూటాన్‌ ప్రభుత్వం నిషేధించడంతో వారికి ఈ పరిస్థితి ఏర్పడింది. ‘క్లోరోఫినాల్‌’ అనే క్రిమిసంహారక మందు ఉందన్న కారణంగా భూటాన్‌ వ్యవసాయ, ఆహార క్రమబద్ధీకరణ సంస్థ భారత్‌ నుంచి పచ్చి మిరపకాయల దిగుమతిపై గత జూన్‌ నెల నుంచి నిషేధం విధించింది. గతంలో కూడా ఇదే కారణంగా కాలిఫ్లవర్, బీన్స్‌లను కూడా భూటాన్‌ ప్రభుత్వం నిషేధించింది.

భూటాన్‌లో దొరికే సేంద్రియ పచ్చి మిరపకాయలు అక్కడి మార్కెట్లో సాధారణంగా కిలో 900 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు అమ్మేవాళ్లు. ఇప్పుడు వాటినే కిలో 2,900 రూపాయలకు అమ్మడంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు మిరపకాయలు లేకుండా వంటలు చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పచ్చి మిరపకాయలు ఇంతకుముందు 25-50 రూపాయల వరకు మార్కెట్లో లభించగా, ఇప్పుడు అవి కిలో 500 రూపాయలకు అమ్ముతున్నారు. భూటాన్‌ ప్రజల అవసరాలకు ఏడాదికి 2,291 టన్నుల పచ్చి మిరపకాయలు అవసరం. అందులో 1,527 టన్నుల మిరపకాయలను ఒక్క డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వినియోగిస్తారు. ఇందులో దాదాపు సగం భారత్‌ నుంచే దిగుమతి అయ్యేవి.


Teluguwow Tv

Related News