చిత్రహింసలవల్లే నేతాజీ మృతి!

Netaji Was Tortured To Death By The British Claims New Book

భారతదేశానికి స్వేచ్చాస్వాతంత్ర్యాలు తెచ్చేందుకు అలుపెరుగని పోరాటం చేసిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మృతిలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్‌ యూనియన్ లో బ్రిటిష్‌ అధికారుల ఇంటరాగేషన్ పెట్టిన చిత్రహింసల వల్ల చనిపోయారని కొత్తవాదన తెరమీదకి వచ్చింది.

రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ జీడీ బక్షీ రాసిన ‘బోస్‌– ది ఇండియన్ సమురాయ్‌’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా బక్షీ తన పుస్తకంలో ఏంరాశారంటే.. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని.. విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు.. ఆయనను విచారణ కు అనుమతించాలంటూ సోవియట్‌ యూనియన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నేతాజీని చిత్రహింసలపాలు చేశారని ఆయన తన పుస్తకంలో వెల్లడించారు.


Teluguwow Tv

Related News