రంగూన్ ఓ రేంజ్‌లో

Rangoon trailer out

సైఫ్ అలీఖాన్- కంగనారనౌత్ - షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో రానున్న మూవీ రంగూన్. దీనికి సంబంధించి 3 నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. వరల్డ్ వార్-2 నేపధ్యంలో వస్తోంది ఈ చిత్రం. ఇందులో కంగనా.. మిస్ జులియా క్యారెక్టర్ చేస్తుండగా, ఈ రోల్ కోసం పెద్ద ఎత్తున పరిశోధన చేసింది. ఇందుకోసం అమెరికా వెళ్లింది కూడా! వార్ సన్నివేశాల చిత్రీకరణ ఎక్కువగా మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగినట్టు కనిపిస్తోంది. వార్‌తోపాటు లవ్ అంశాలు పుష్కలంగా వున్నాయి. ఇందులో ముగ్గురు నటీనటులు పోటీపడి మరీ నటించడం గమనార్హం. విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Teluguwow Tv

Related News