ఒంటరిగా ఉండే మహిళలకు వెయ్యి

Poor single women to get Rs 1000 aid every month from Telangana govt

తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న మహిళలకు కెసిఆర్ సర్కార్ అండగా ఉండాలని నిర్ణయించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి నెలకు వెయ్యిరూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించింది. ‘ఒంటరి స్త్రీలకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల జీవన భృతి’ పథకం అమలులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని 3 లక్షల మంది ఒంటరి మహిళలు ప్రతీనెలా రూ.1000ల జీవన భృతి పొందనున్నారు. ఆసరాలేని ఒంటరి మహిళలు తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడాలేని రీతిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పించన్లు అందిస్తున్నామని, ఇది మరో అద్భుతమైన పథకమని కెసిఆర్ ఈ సందర్భంగా చెప్పారు.


Teluguwow Tv

Related News