దూకుడు 2 లో చైతూ

Naga chaitanya new project with Srinu Vaitla

నాగచైతన్య ఫిల్మ్ కెరీర్ ఊపందుకుంది. తాజాగా ఈ హీరో కొత్త ప్రాజెక్టు ఓకే చేసినట్టు సమాచారం. రీసెంట్‌గా డైరెక్టర్ శ్రీనువైట్ల తన వద్దనున్న స్టోరీని చైతూకి వినిపించడం, బాగుందని చెప్పడంతో దాన్ని డెవలప్ చేయమని సలహా ఇచ్చాడట. ఇప్పుడు ఆ పనిలోనే శ్రీను బిజీగా వున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. దీన్ని ‘దూకుడు 2’గా వర్ణిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. కామాక్షి ఆర్ట్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్టు జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమట. ప్రస్తుతం నాగచైతన్య- రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ రానుంది. దీన్ని సమ్మర్‌కి రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. ఇటు శ్రీను వైట్ల ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో మిస్టర్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెల్సిందే!


Teluguwow Tv

Related News