యాక్షన్ మూవీలో రాధికా ఆప్టే!

Radhika Apte in a action movie after Kabali in tamil

నటనకి అవకాశం వున్న పాత్రల్లోను.. శృతిమించిన శృంగార పాత్రల్లోను నటించి రాధికా ఆప్టే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 'బద్లాపూర్'.. 'హంటర్'.. 'పార్చ్ డ్' వంటి సినిమాలు, రాధిక నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. తెలుగులో చేసిన 'లెజెండ్'.. తమిళంలో చేసిన 'కబాలి' సినిమాలు కూడా ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.

అలాంటి రాధికా ఆప్టే ఈసారి తమిళంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతోంది. ఈ సినిమాలో ఆమె పూర్తిస్థాయి యాక్షన్ రోల్ లో కనిపించనుంది. తమిళ దర్శకుడు మిస్కిన్ సోదరుడు ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ తెరపై అందాలు ఆరబోస్తూ వచ్చిన ఈ సుందరి, ఇక యాక్షన్ రోల్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.


Teluguwow Tv

Related News