నాగ్ మూవీలో సమంతా!

samantha in nagarjuna movie

తాజాగా తాను ఒక తెలుగు సినిమాను అంగీకరించాననీ .. అదేమిటనేది త్వరలో చెబుతానని అభిమానుల్లో సమంతా ఆసక్తిని రేపింది. అప్పటి నుంచి వాళ్లంతా అందుకు సంబంధించిన సమాచారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతా ఓకే చెప్పిన తాజా చిత్రం 'రాజుగారి గది 2' అనే వార్త షికారు చేస్తోంది.

ఓంకార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నాగార్జున కీలకమైన పాత్రను పోషించనున్నాడు. శీరత్ కపూర్ .. అశ్విన్ .. వెన్నెల కిషోర్ .. ప్రవీణ్ ముఖ్యమైన పాత్రలను ధరించనున్నారు. మరో ముఖ్యమైన పాత్రను సమంతా చేస్తోందట. నాగ్ ఇంటికి కోడలిగా వెళ్లనున్న సమంతా ఆయన మూవీలో నటిస్తుండటం ఒక విశేషమైతే, మొదటిసారిగా హారర్ మూవీలో నటించనుండటం మరో విశేషం.


Teluguwow Tv

Related News