పూల ‘దండన’

open pee kings garlanded

హైదరాబాద్ సిటీలో బహిరంగంగా మూత్రం పోసేవారిని నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం చేస్తోంది. అలాంటివారికి పూల దండలు వేసి సున్నితంగా హెచ్చరిస్తున్నారు సిబ్బంది. కోఠీ, సుల్తాన్ బజార్, పుత్లిబౌలీ, చాదర్ ఘాట్ వంటి అనేక చోట్ల చాటుమాటున ఇలా చేస్తున్నవారిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు వీరిపై జరిమానాలు విధిస్తూ వచ్చినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కొన్ని చోట్ల ఈ తంతు ఫన్నీగా సాగుతోంది.

కెమెరాలు, పూల దండలతో తమను పట్టుకునేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బందిని చూసి బెదిరిపోయి పరుగు తీస్తున్నవారు కొందరైతే.. ఇదేంటో అర్థం కాక అక్కడే నిలబడిపోయి దండలు వేయించుకుంటున్న వారు మరికొందరు... అయితే కొంతమంది దాడులకు కూడా దిగుతున్నారు. తమ ఫోటోలను తీయడానికి ప్రయత్నిస్తున్నవారిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకుంటున్నారు.ఈ పూల ‘దండన’ కార్యక్రమం ఎన్నాళ్ళు సాగుతుందో చూడాలి.


Teluguwow Tv

Related News