ఇంతకీ.. ఆ హీరో ఎవరు..?

archana veda revealed hero harassment

టాలీవుడ్‌లో ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ర్టీలో హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైన ఘటనలు ఇటీవలి కాలంలో బయటపడుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ అర్చన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు.. షూటింగ్‌ పూర్తయిన తర్వాత.. నీకు అవకాశం ఇచ్చాను.. నాకేమిస్తావ్‌ అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది.

వెంటనే.. మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయానని, ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది అర్చన. ఇక అవార్డుల ఫంక్షన్‌లో ఓ అవార్డు ఇవ్వడానికి ఓ నటుడితో కలిసి వేదిక మీదకు తాను వెళ్లాలని నిర్వాహకులు చెప్పారని, లాస్ట్ మినిట్‌లో ఆ హీరో తనతో కలిసి వేదిక మీదకు రావడానికి ఇష్టపడలేదని వెల్లడించింది. ఈ క్రమంలో హీరోకి తోడుగా మరో హీరోయిన్‌ను పంపించారని తెలిపింది అర్చన. ఇంతకీ ఆ హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సినీ లవర్స్.


Teluguwow Tv

Related News