వైరస్‌ పూర్తయింది

Virus movie first look poster

సంపూర్ణేష్‌ బాబు హీరోగా రూపొందుతున్న ‘వైరస్‌’ షూటింగ్‌ పూర్తయింది. నో వ్యాక్సిన్ ఒన్లీ టాక్సిన్ అనేది ఉపశీర్షిక. పల్లెరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. ఎయ్‌స్ఎన్ ఫిల్మ్స్‌ అండ్‌ జస్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ఎం.డి.సలీమ్‌, శ్రీనివాస్‌ మంగాల నిర్మించారు. యస్‌.ఆర్‌.కృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వైరస్‌ ఫస్ట్‌లుక్‌ని ఆదివారం విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చేశాం. టెర్రిఫిక్‌ హార్రర్‌ కామెడీతో తెరకెక్కించాం. మర్డర్‌ మిస్టరీతో సాగే కథనం యువతను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: మీనాక్షి భుజంగ్‌, నేపథ్య సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నృత్యాలు: శేఖర్‌, భాను, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్.


Teluguwow Tv

Related News