పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేశాయి

Venkaiah Naidu Speech At National E-Governance Summit

దేశాన్ని ప‌ట్టి పీడిస్తోన్న అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని నల్లధనం, అవినీతి నిర్మూల‌నే ల‌క్ష్యంగా మోదీ ప‌నిచేస్తున్నార‌ని ఆయన అన్నారు. పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేశాయని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల దేశంలో పారదర్శకత పెరుగుతోందని చెప్పారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేత‌లు అనవసర రాద్ధాంతం చేస్తున్నార‌ని వెంకయ్య నాయుడు అన్నారు. అభివృద్ధిలో చైనా కన్నా మ‌న‌దేశం దూసుకుపోతోందని అన్నారు. పరిపాలనలో ఈ గవర్నెన్స్ కు త‌మ స‌ర్కారు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఇప్ప‌టికే దేశంలో అన్ని రకాల అనుమతులకు ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టామని, దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు.


Teluguwow Tv

Related News