పాన్ తప్పనిసరి.. లేకపోతే..!

PAN card must for excise and service taxpayers to migrate to new tax regime

పన్ను ఎగవేతదారులను అన్నివైపుల నుంచి రౌండప్ చేస్తోంది కేంద్రం. ఇప్పటికే అన్ని అకౌంట్లకు ఆధార్ లింక్ పెట్టేసిన ప్రభుత్వం.. తాజాగా బ్యాంకు ఖాతాలన్నింటికీ పాన్‌కార్డు తప్పనిసరి చేసింది. ఇందులోభాగంగా ఖాతాదారులందరి నుంచి పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్- పాన్ తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ పాన్‌ లేనట్లయితే వాళ్ల నుంచి ఫారమ్‌–60ను తీసుకోవాలని సూచించింది. ఈ తతంగాన్ని పూర్తి చేయడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరో విషయం ఏంటంటే.. ఈ నిబంధన జన్‌ధన్‌, జీరో బ్యాలెన్స్‌, పొదుపు ఖాతాలకు వర్తించదట. ఏప్రిల్‌ ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని భావించిన కేంద్ర ఎక్సయిజ్‌, కస్టమ్స్‌ బోర్డు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్సయిజ్‌, సేవా పన్నులు అన్నీ ఇకపై జీఎస్టీలో విలీనంకావడంతో ఈ రెండు పన్నులు చెల్లిస్తున్న వారంతా కొత్త విధానంలోకి మారేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నెంబరు ఇస్తోంది. పాన్‌ లేనివాళ్లు వీలైనంత తొందరగా తీసుకోవాలని సూచించింది.


Teluguwow Tv

Related News