మేమూ ఫత్వా జారీ చేస్తాం

Hyderabad madrassa empowers girls with course on fatwa

ముస్లింలలో ఫత్వా (తీర్పు) జారీ చేసే అధికారాన్ని మహిళలకూ ఇస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ మొఘల్ పురలోని ఓ మదర్సా ఇన్స్ టి ట్యూట్ లో ముస్లిం అమ్మాయిలకు ఫత్వా జారీలో శిక్షణ ఇవ్వడం విశేషం. ఖురాన్ పై కామెంటరీలు, మహ్మద్ ప్రవక్త ప్రవచనాలతో కూడిన పుస్తకాలను విద్యార్థినులు చదవడంలో బిజీ అవుతున్నారు. ఏడాది శిక్షణ పూర్తి అయ్యాక వీరిని ముఫ్తియాలని అంటారు. పెళ్ళిళ్ళు, డైవోర్స్, దత్తత, ఆస్తి విషయాలు, నమాజ్, రోజా (ఉపవాసం) వంటి వివిధ అంశాలతో ఉన్న ఫత్వాలను చాలావరకు మగవారే ఇచ్చేవారు. అయితే ఈ పవర్స్ ని మహిళలకూ ఇస్తున్నారని, ఇది సంవత్సరం సాగే కోర్సని ఈ మదర్సా వ్యవస్థాపకురాలు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు రెండున్నరవేలమంది విద్యార్థినులు ట్రైనింగ్ పొందుతున్నారు.


Teluguwow Tv

Related News