పవన్ లిఫ్ట్ ఇచ్చారు

Shruti Hassan Speaks about Pawan Kalyan

కమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ ఫిల్మ్ కెరీర్ గ్రాండ్‌గా బాలీవుడ్‌లో స్టార్ట్ అయ్యింది. కానీ అక్కడ సక్సెస్ లేక సౌత్ బాట పట్టింది. ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌కి ఆ మూవీ కూడా ఫ్లాప్ అయ్యి షాక్ ఇచ్చింది. తరువాత సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘ఓ మై ఫ్రెండ్’ మూవీ కూడా శృతికి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇక శృతికి ఐరెన్ లెగ్ ముద్ర పడడం పక్కా అనే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది.

‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఫస్ట్ టైం శృతి సక్సెస్ టేస్ట్ చూసింది. ‘వరుస ఫ్లాప్స్‌లో వున్న నాకు పవన్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో లిఫ్ట్ ఇచ్చారు. అందుకే నా ఫిల్మ్ కెరీర్‌లో పవన్‌కి స్పెషల్ ప్లేస్ వుంటుంద’ని అంటోంది శృతి. 2012లో ఆ మూవీ చేసిన తరువాత మళ్ళీ ఇప్పుడు ‘కాటమరాయుడు’ మూవీలో పవన్ పక్కన సెకండ్ టైం కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రం కూడా ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని శృతి కాంఫిడెంట్‌గా వుంది.


Teluguwow Tv

Related News