కొడుక్కి వార్నింగ్‌ ఇచ్చిన మోహన్‌బాబు!

Mohan Babu Strong Warning To Manchu Vishnu

తెర మీదే కాదు తెరవెనుక కూడా విలక్షణంగా ఉండే నటుడు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు. ఏమైనా తేడా వస్తే ఎంత పెద్దవారినైనా, సొంత బిడ్డలనైనా నిలదీయడానికి వెనుకాడడు. సోమవారం జరిగిన ‘లక్కున్నోడు’ ఆడియో ఫంక్షన్‌లో తన కొడుకు విష్ణుకు వార్నింగ్‌ ఇచ్చాడు మోహన్‌బాబు.

‘విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్‌ ఏ వార్నింగ్‌. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. ‘నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు. సిన్సియర్‌గా ఉండు’ అంటూ వేదిక మీదే వార్నింగ్‌తో కూడిన సూచన చేశారు మోహన్‌బాబు.


Teluguwow Tv

Related News