నా భార్యే నాకు పెద్ద విమర్శకురాలు

Upasana Is Powerful Critic for Ram Charan

మెగా పవర్ స్టార్ గా ధృవ సక్సెస్ సంబరాల నుంచి బయటకు వచ్చేసిన చెర్రీ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150కి నిర్మాతగా పనులు చూసుకుంటున్నాడు. తన తర్వాతి మూవీ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఖైదీ ప్రమోషన్స్ లో భాగంగా.. తన సినిమాలపై భార్య ఉపాసన రియాక్షన్ గురించి.. చెప్పుకొచ్చాడు చెర్రీ.

'సాధారణంగా ఓ ప్రాజెక్టు సైన్ చేసే ముందు నా భార్య అభిప్రాయం అడగను. మేము అసలు ఇంట్లో మా ప్రొఫెషన్ కి సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకోం. కానీ నా సినిమాలు అన్నీ చూడడం తనకు చాలా ఇష్టం. అంతే కాదు.. తనే నాకు పెద్ద విమర్శకురాలు కూడా. తన అభిప్రాయం ఏంటో నిక్కచ్చిగా చెప్పేస్తూ ఉంటుంది. నేను కూడా తన అభిప్రాయాలు.. సలహాల కోసం ఎదురుచూస్తుంటాను' అని చెప్పాడు రామ్ చరణ్.

ఇప్పటివరకూ తండ్రి చిరంజీవితో కానీ.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించలేదు రామ్ చరణ్. మగధీర.. బ్రూస్ లీ మూవీల్లో చిరు కనిపించినా అవి కేమియోలు మాత్రమే. ఖైదీ నంబర్ 150లో లో చెర్రీ కూడా 30 సెకన్లు కనిపించనున్నాడంతే. అయితే.. వారితో కలిసి నటించడం అంటే తనకు చాలా ఇష్టమని.. సరైన స్క్రిప్ట్ దొరికితే మాత్రం ఏ రకంగానూ ఆ ప్రాజెక్టును వదులుకునే సమస్యే లేదని చెబుతున్నాడు చెర్రీ.


Teluguwow Tv

Related News