పర్యావరణ పోలీసులు వచ్చేస్తున్నారు

china to launch environmental police force

సివిల్ పోలీసులు - ట్రాఫిక్ పోలీసుల తరహాలో పర్యావరణ పోలీసులు రానున్నారు. చైనా రాజధాని బీజింగ్ పై తరుచూ కాలుష్య మేఘాలు కమ్ముకుంటుండటం ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్విరాన్మెంటల్ పోలీస్ పేరుతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ పర్యావరణ పోలీసులు నగరంలో తిరుగుతూ వాతావరణంలోకి వెలువడుతున్న పొగ కాలుష్యాన్ని గమనిస్తారని ఆ ప్రాంతానికి చేరుకొని నిబంధనలకు విరుద్ధంగా బొగ్గు - వ్యర్థాలు - ఇతర పదార్థాలను కాల్చుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటారని బీజింగ్ మేయర్ తెలిపినట్టు చైనా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ సిన్హువా వెల్లడించింది.

ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలు పరిశ్రమల్లో బొగ్గు కాలుస్తున్నారని కొన్నిచోట్ల చెత్తకుండీలను తగులబెడుతున్నారని గుర్తించామని ఈ నేపథ్యంలో పర్యావరణ పోలీస్ లను నియమించామని మేయర్ పేర్కొన్నారు. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమల్లో అత్యధికంగా వ్యర్థాలు విడుదల చేస్తూ కాలుష్యానికి కారణం అవుతున్న 500 కంపెనీలను మూసివేయనున్నట్టు చెప్పారు. ప్రమాణాలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 లక్షల వాహనాలను ఫిబ్రవరి నుంచి నిషేధించనున్నట్టు చెప్పారు. కాలుష్యం కారణంగా గతవారం బీజింగ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా 20 పట్టణాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. చైనాతో ప్రారంభమైన ఈ ట్రెండ్ భవిష్యతులో మిగతా దేశాలకు సైతం విస్తరించే అవకాశం ఉందని సమాచారం.


Teluguwow Tv

Related News